రాష్ట్ర శాసనసభ వ్యవహారాల ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు - Allotment of House Sites
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 10:39 AM IST
House Sites Allotment to Legislative Department Employees: ఎన్నికల(AP Elections 2024) నియమావళి అమలులోకి వస్తుందన్న కొన్ని గంటల ముందు రాష్ట్ర శాసనసభ వ్యవహరాల ఉద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. పిచ్చికలపాలెంలో వీరికి స్థలాలు కేటాయంచాలని సీఆర్డీఏ(CRDA) కమిషనర్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పట్టణాభివృద్ధిశాఖ జారీ చేసిన 34, 66వ జీవోలను అనుసరించి ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏను ఆదేశించింది.
House Sites for Employees: ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం అమరావతి రాజధానిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జగన్(CM Jagan) ప్రభుత్వం(YSRCP Govt) 5 ఏళ్ల సమయం తీసుకోవడంపై ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజున జీవో ఇవ్వడం ద్వారా ప్రయోజనం చేరుకూరుతుందా అనే అనుమానం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.