హాస్టల్ నిర్మాణానికి 12ఏళ్లు!- కూటమి ప్రభుత్వమైనా పూర్తి చేయాలని కోరుతున్న విద్యార్థులు - Pending Hostel Works in Guntur - PENDING HOSTEL WORKS IN GUNTUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 2:21 PM IST
Govt Hostel Pending Works in Guntur : ఐదేళ్లు కాదు పదేళ్లు కాదు ఏకంగా పుష్కరకాలంగా గుంటూరులో సమీకృత వసతిగృహ భవనం నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.05 కోట్లతో దీనికి శ్రీకారం చుట్టింది. 2014లో రాష్ట్ర విభజనతో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను, గత టీడీపీ సర్కార్ తిరిగి ప్రారంభించింది.
2019 నాటికి 75 శాతం వరకు నిర్మాణం పూర్తి అయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు విడుదలను ఆపేసింది. దీంతో 500 మందికి పైగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వసతి అందించాల్సిన ఈ భవనం, ఐదేళ్లుగా నిరుపయోగంగా పడి ఉంది. ఇప్పటికైనా హాస్టల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని అంటున్నారు. ఆగిపోయిన నిర్మాణం వల్ల గ్రామీణ విద్యార్థులు పడుతున్న అవస్థలు, భవన ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు.