కనిగిరిలో వాలంటీర్లకు తాయిలాలు - జగన్ చిత్రంతో ఉన్న సంచిలో గిఫ్టులు
🎬 Watch Now: Feature Video
YSRCP Gifts and Cash Distribution to Volunteers: ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ కార్యాలయంలో వాలంటీర్లకు 5వేల నగదు కవరుతోపాటు 4 రకాల వస్తువులతో కూడిన గిఫ్ట్‌లను ఆ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ముందుగా స్థానిక పార్టీ కార్యాలయంలో వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కనిగిరి మున్సిపాలిటీతో పాటు మండలంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 మంది వాలంటీర్లకు 5 వేల రూపాయల నగదుతో కూడిన ఓ కవరుతో పాటు హాట్ బాక్స్, వాటర్ బాటిల్, డిన్నర్ సెట్‌తో కూడిన గిఫ్ట్ సంచిని పంపిణీ చేశారు.
డిన్నర్ సెట్, హాట్ బాక్స్‌లను జగన్ చిత్రంతో ఉన్న ఓ సంచిలో ఉంచి పంపిణీ చేశారు. సంచిపై జగన్ ఫొటోతో పాటు కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ ఫోటో, పేరు చిత్రీకరించారు. జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటో, పేరుతో ఉన్న స్టిక్కర్లను ఆయా బాక్సులకు అంటించి మరీ పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు అందించిన గిఫ్ట్ బాక్స్‌లతో వెళ్తున్న వాలంటీర్లను చూసి స్థానికులు చర్చించుకుంటున్నారు. వైసీపీ నేతలు వాలంటీర్లకు ఎన్నికల తాయిలాలు పంపిణీ చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు వాలంటీర్లను ప్రచార కార్యకర్తలుగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేందుకు యత్నిస్తున్నారనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.