వైఎస్సార్ ఆసరా సభలో జనం లేక దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు - ఒంగోలులో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 9:43 PM IST
YSR Asara Program in Ongole: వైఎస్సార్సీపీ నిర్వహించిన వైఎస్సార్ ఆసరా సభలో జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమం నిర్వహించారు. గంటలకొద్ది కూర్చోబెట్టి కనీస సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కార్యక్రమం జరుగుతుండగానే మహిళలు పెద్ద సంఖ్యలో ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. కార్యాలయం గేటు వద్ద సెక్యూరిటీ ఆపాలని చూడగా మహిళలు పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
Women Facing Problems in YSR Asara Program: ఈ కార్యక్రమంలో మహిళలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్క మహిళలకు చెక్కు ఇస్తామని చెప్పి పిలిపించారని, తీరా వస్తే గంటలకొద్దీ కూర్చోబెట్టడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యామని మహిళలు వాపోయారు. కార్యక్రమం జరుగుతుండగానే సభ వదిలి వెళ్లపోయే ప్రయత్నం చేయగా గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది మహిళలను ఆపేందుకు యత్నించారు. అయినప్పటికీ మహిళలు పట్టించుకోకుండా గేటు తీసుకొని వెళ్లిపోయారు.