Live: వైఎస్ షర్మిలతో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Interview Live - YS SHARMILA INTERVIEW LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/640-480-21405308-thumbnail-16x9-ys-sharmila-exclusive-interview-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 9:11 AM IST
|Updated : May 7, 2024, 11:22 AM IST
YS Sharmila Exclusive Interview Live : "వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్‌కు అధికారం ఉందన్న అహంకారంతోనే. అవినాష్‌రెడ్డిని చట్టసభలకు వెళ్ల్లకుండా చూడాలనే అక్కడ పోటీ చేస్తున్నాను. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేది నేనే. కుటుంబంలో ఒక్కరే రాజకీయాల్లో ఉండాలన్నట్లు జగన్ మాట్లాడారు. వ్యాపారాలు చూసుకోవాలి అంటున్నారు. వ్యాపారాలు చేసుకోవాలని అప్పట్లో నేను అనుకుంటే ఈ రోజు వైఎస్సార్సీపీ ఎక్కడుండేది? కడప లోక్‌సభ స్థానం ఎన్నికల్లో న్యాయానికి, నేరానికి మధ్య పోరాటం జరుగుతోందని, అందులో గెలిచేది న్యాయం వైపున్న తానేనని" పీసీసీ అధ్యక్షురాలు, సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఆయన్ను మించిన ఊసరవెల్లి ఇంకెవరుంటారని నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక రిలయన్స్ సంస్థ హస్తం ఉందని అప్పట్లో ఆరోపించి, వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ మనిషికి ఎంపీ పదవి ఇవ్వడమే ఆయన నైజమేంటో చెప్పిందని విమర్శించారు.కడప లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్‌రెడ్డిని సవాల్ చేస్తున్న షర్మిల 'ఈనాడు- ఈటీవీ-ఈటీవీ భారత్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం
Last Updated : May 7, 2024, 11:22 AM IST