భారత్‌లోనే యంగెస్ట్ స్టూడెంట్ పైలట్‌గా హైదరాబాద్ కుర్రాడు - 16 ఏళ్లకే ఎలా అయ్యాడో తెలుసా? - Rakshit Youngest Student Pilot
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-01-2024/640-480-20573822-thumbnail-16x9-pilot.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 23, 2024, 2:47 PM IST
Youngest Student Pilot in India Rakshit : పైలట్ కావాలి. గాల్లో ఎగరాలి. అనేది నేటి యువత ఆలోచన. కానీ, దానిపై అవగాహన అంతంత మాత్రమే. పైలట్ కావాలని కలలు కన్నా, అది అనుకున్నంత సులభం కాదు. దానికెంతో ఓర్పు, శిక్షణ అనేది చాలా అవసరం. ఆ యువకుడు మాత్రం చిన్ననాడే పైలట్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇష్టమే అతడిని భారత్‌లోనే యంగెస్ట్ స్టూడెంట్ పైలట్‌గా నిలిచేలా చేసింది. 95 గంటల ఫ్లై అవర్స్ కూడా పూర్తి చేసుకుని, 16 ఏళ్ల వయస్సులోనే స్టూడెంట్ లైసెన్స్ తీసుకున్నాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన యువ పైలట్ రక్షిత్.
ఇటీవల హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగిన వింగ్స్ ఇండియా 2024లో అందరి దృష్టిని ఆకర్షించిన రక్షిత్, 2021లో శిక్షణ ప్రారంభించాడు. 95 గంటల ఫ్లై అవర్స్ పూర్తి చేసుకుని స్టూడెంట్ లైసెన్స్ సంపాదించాడు. అతి చిన్న వయసులో ఈ లైసెన్స్ పొందిన వారిలో దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు రక్షిత్. మరి ఈ పైలట్ కోర్సు ఎలా ఉంటుంది? ఇక్కడి వరకు రావడానికి రక్షిత్ ఎంచుకున్న మార్గమేంటి? పైలట్‌గా రాణించాలనుకునే వారికి అతడు ఎలాంటి సూచనలు చేస్తున్నాడు? అనే అంశాలను రక్షిత్‌ను అడిగి తెలుసుకుందాం.