నంద్యాల వైసీపీలో వర్గపోరు - ఎమ్మెల్యే తీరుపై జడ్పీటీసీ నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 2:07 PM IST

thumbnail

YCP ZPTC Protest Against MLA Shilpa Ravi: నంద్యాల వైసీపీలో రోజురోజుకూ అసమ్మతి భగ్గుమంటోంది. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి తీరుకు నిరసనగా దీక్ష తలపెట్టిన నంద్యాల వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు గోకుల్ కృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గోకుల్ కృష్ణారెడ్డిపై పరోక్షంగా ఎమ్మెల్యే శిల్పా రవి ఓ ఫొటోతో అసభ్యకరంగా ఉన్న వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో గోకుల్ మాతృమూర్తుల ఆత్మగౌరవ యాత్ర తలపెట్టారు. అతనిని పోలీసులు గ్రామంలో నుంచి రానివ్వలేదు. గోకుల్​ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో గోకుల్ తల్లి భక్తవత్సలమ్మ నంద్యాలలో నిరసన దీక్ష చేపట్టారు. మహిళను అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే శిల్పా రవి ఫొటోతో పోస్ట్ రావడాన్ని ఆమె ఖండించారు. 

స్థానికేతరుడు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి స్థానికులను అణగదొక్కుతున్నారని, అతని అరాచకాలను ప్రశ్నించేందుకు ఎవరూ ముందుకు రాలేక పోతున్నట్లు గోకుల్ తెలిపారు. ఎమ్మెల్యే శిల్పా రవిపై ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. నంద్యాలలో చోటు చేసుకున్న పరిణామాలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లాలని జడ్పీటీసీ గోకుల్ కృష్ణా రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.