కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల అరాచకం - టీడీపీ జెండాలను తొలగించి కార్యకర్తలపై దాడి - YCP leaders attack on TDP - YCP LEADERS ATTACK ON TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 10:36 PM IST
YCP Leaders Attack on TDP Workers in Krishna District : రాష్ట్రంలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో వైఎస్సార్సీపీ మూకల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. టీడీపీ జెండాలను తొలగిస్తూ, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో వైఎస్సార్సీపీ అభ్యర్ధి జోగి రమేష్ అనుచరులు అరాచకం సృష్టించారు. చెట్లకు, స్తంభాలకు కట్టిన తెలుగుదేశం జెండాలను తొలగించి గందరగోళం చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడె ప్రసాద్ గంగూరులో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా కార్యకర్తలు టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు.
అయితే ఈరోజు జోగి రమేష్ ప్రచారానికి వస్తున్నారని వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాలని తీసి వాహనాలు, కాళ్ల కింద వేసి తొక్కుతూ వీరంగం సృష్టించారు. ప్రశ్నించడానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే ప్రచారం పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రహరీ గోడలు, తలుపులపై వైఎస్సార్సీపీ సిద్ధం స్టిక్కర్లు అంటిస్తున్నారు. మరోవైపు ఓటర్లను భయపెట్టి తమవైపు తిప్పుకునేందుకు కూటమి నాయకులపై దాడులకు తెగబడుతున్నారు.