వాలంటీర్లు వైసీపీ కోసమే పని చేస్తున్నారు - వారికి ఏదైనా జరిగితే టీడీపీ అంతుచూస్తా: హనిమిరెడ్డి - Hanimi Reddy Warning to TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 7:39 PM IST
YCP Candidate Hanimi Reddy Warning to TDP Activists: బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ అభ్యర్థి హనిమి రెడ్డి (YCP candidate is Hanimi Reddy) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు తమ మనుషులని వైసీపీ కోసమే పని చేస్తున్నారని అందులో మీకు ఎందుకు ఇబ్బంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల చేత రాజీనామా చేయించి ప్రత్యక్ష రాజకీయాల్లో తిప్పుకుంటామని ఏం చేస్తారో చేసుకోండంటూ తెలుగుదేశం నేతలకు సవాల్ విసిరారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు టీడీపీ నాయకులు ఆజ్యం పోస్తున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం బల్లికురవ మండలంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌పై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలారా నా సంగతి మీకు బాగా తెలియదు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. సాఫ్ట్‌గా ఉన్నాను అనుకుంటున్నారేమో జాగ్రత్త అంటూ టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై విరుచుకు హనిమి రెడ్డి పడ్డాడు. వైసీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని వారికి ఏదైనా జరిగితే అంతు చూస్తానంటూ హనిమి రెడ్డి శివాలెత్తిపోయారు.