యానాం బురదమయం- అపరిశుభ్రంగా పర్యాటక ప్రాంతాలు - Yanam Tourist Places Muddy to Flood - YANAM TOURIST PLACES MUDDY TO FLOOD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 1:06 PM IST
Yanam Tourist Places Become Muddy Due to Flood : కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వరదలు తగ్గినా అవస్థలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమి, గోదావరి నది వరద ప్రభావంతో పర్యాటక ప్రాంతాలైన పుష్కర్ ఘాట్, రాజీవ్ బీచ్ బురద మయమయ్యాయి. వరద నీటిలో కొట్టుకు వచ్చిన చెత్తంతా గట్టు పైకి చేరి పర్యాటకులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తుంటారు.
ముఖ్యంగా శని, ఆదివారాల్లో అయితే వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ప్రాస్టిక్ వస్తువులు, చెత్త పుష్కర్ ఘాట్‌కు కొట్టుకువచ్చాయి. దీంతో ఆ ప్రాంతాలు కళావిహీనంగా మారాయి. ఈ నెలాఖరులో మళ్లీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని సాకు చూపుతూ అధికారులు చెత్త తొలగించట్లేదని స్థానికులు ఆరోపించారు. పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని వెంటనే చెత్త, బురద తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.