యాదాద్రి హుండీ లెక్కింపు - 35 రోజుల్లో రూ.2 కోట్ల 85 లక్షలకు పైగా ఆదాయం - Yadadri Hundi Counting - YADADRI HUNDI COUNTING

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 10:50 PM IST

Yadadri Hundi Counting : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీని దేవస్థాన సిబ్బంది, అధికారులు లెక్కించారు. మొత్తం 35 రోజుల్లో రూ.2 కోట్ల 85 లక్షల 2 వేల 418 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. కాగా 4 వందల 25 గ్రాముల బంగారం, 5 కిలోల 960 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీలను భక్తలు సమర్పించినట్లు తెలిపారు. 

Yadadri Hundi Income : 2,697 అమెరికన్​ డాలర్లు రాగా 85 ఆస్ట్రేలియా డాలర్స్, 30 ఇంగ్లాండ్ పౌండ్స్, 20 యూఏఈ దిర్హామ్స్‌, 120 యూరోప్ యూరో, మలేసియా 24 రింగిట్స్, నేపాల్ 10 రుపీస్, కెనడా 35 డాలర్స్, ఉబ్జెకిస్తాన్ 1000 సొమ్, ఒమన్ 1/4 రియల్, ఖతర్​ 2 రియల్, సౌదీ అరేబియన్ 27 రియల్, ఒమన్ 100 బైసా హుండీల్లో కానుకల రూపంలో వచ్చాయని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.