మండుటెండలో కలెక్టరేట్ వద్ద మహిళల నిరసన- మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ - kuravapalli Women Protest - KURAVAPALLI WOMEN PROTEST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 3:57 PM IST
Women Protest With Empty Bins Infront Of Collectorate: తాగు నీటి సమస్య పరిష్కరించాలని, అంతవరకూ కదిలేది లేదని మహిళలు కలెక్టరేట్ పై బైఠాయించిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. కలెక్టర్ అభిషిత్ కిషోర్ వచ్చి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
kuravapalli Water Crisis: జిల్లాలోని రాయచోటి మండలం కురవపల్లి దళిత వాడలోని మహిళలు తాగునీరు సమస్య పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. రెండు నెలలుగా తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు లేకపోవడంతో పశువులకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని కలెక్టరేట్ ముందు బైఠాయించారు. దీంతో కలెక్టర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.