యోగా శిక్షణ తీసుకుంటున్న మహిళలపై అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టు- దేహశుద్ధి చేసిన మహిళలు - women Beaten man in Yoga Center
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 9:37 PM IST
Women Beaten Man Misbehaving Towards Them at Palnadu: మహిళలను కించపరుస్తు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు చేసిన ఓ వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేశారు. యోగా ప్రక్రియ ద్వారా మానసిన ఉల్లాసం శిక్షణ కార్యక్రమంలో యోగా చేస్తున్న మహిళలపై ఓ వ్యక్తి అసభ్యకరంగా వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో స్థానికంగా వైరల్ కావడంతో సదరు శిక్షణ కార్యక్రమానికి హజరైయ్యే మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీంతో ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని మహిళలు చితకబాదారు. అంతటితో ఆగకుండా మళ్లీ జీవితంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దంటూ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
నంద్యాల జిల్లాలో ఓ యోగా కేంద్రంలో (Yoga Center) మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ సమయంలో వెంకటేష్ బాబు అనే వ్యక్తి అసభ్యకరంగా వీడియో తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటంతో ఇతని తీరుపై మహిళలు, యోగా కేంద్ర నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని కారులో ఎక్కించుకుని పోలీసులకు అప్పగించారు.
"మానసిక ప్రశాంతత కోసం మేము యోగా శిక్షణ కేంద్రానికి వస్తాము. మానసిక ఉత్తేజం కోసం ఆటలు, పాటలు, నృత్యం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంటాం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టు చేయటం వల్ల చాలా మంది మహిళలు భయటకు రావడానికి భయపడతారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఇటువంటి వ్యక్తుల వల్ల మరుగున పడుతున్నాయి." -బాధిత మహిళలు -