పల్నాడు జిల్లాలో దారుణం - నీళ్లు అడిగినందుకు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారు - woman killed asking for water
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 3:12 PM IST
Woman Killed by a Tractor for Asking Water in Palnadu District : తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చోసుకుంది. రెంటచింతల మండలం మల్లవరంలో తాగునీటి సమస్య ఉంది. అక్కడి ప్రాంతవాసులకు ట్రాక్టర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇవాళ ట్యాంకర్ వద్దకు నేనావత్ సామి (50) అనే మహిళ వచ్చింది. టీడీపీకి చెందిన వారికి నీళ్లు ఇచ్చేది లేదంటూ ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
తాగునీటి కోసం సామి ట్రాక్టర్‌కు అడ్డుగా నిల్చొని మంచినీళ్లు తెచ్చింది ప్రజలందరి కోసమే కదా అని ప్రశ్నించింది. ఆమె మాటలు లెక్క చేయకుండా డ్రైవరు ట్రాక్టర్‌ను ముందుకు పోనివ్వడంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లే మార్గంలోనే మృతి చెందింది. తాగునీరు అడిగితే చంపేస్తారా అని బాధిత కుటుంబ సభ్యులు వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనను మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి తీవ్రంగా ఖండించారు.