ప్రభుత్వాసుపత్రిలో దారుణం- మార్చురీలో ఉంచిన మృతదేహానికి చీమలు - జమ్మలమడుగు ఆస్పత్రిలో దారుణం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 4:36 PM IST

Woman Dead Body Eaten Ants in Hospital Mortuary: మార్చురీలో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టి పీక్కుతింటున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు.

జమ్మలమడుగులోని బీసీ కాలనీలో పదహారేళ్ల బాలిక సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే పోస్టుమార్టం కోసం తరలించగా ఇంతవరకూ శవ పరీక్ష నిర్వహించలేదు. మార్చురీలోని పనిచేయని ఓ ఫ్రీజర్​లో మృతదేహాన్ని పెట్టడంతో చీమలు పట్టాయి. మంగళవారం బంధువులు వచ్చి మృతదేహాన్ని చూసి ఆవేదనతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. 

ప్రీజర్ పనిచేయలేదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పట్టణ ఎస్ఐ సుబ్బారావు అక్కడకు చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఈ విషయంపై జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ పాషాకు వివరణ కోరగా ఫ్రీజర్ తెరిచినప్పుడు లైట్లు వెలగడంతో అది పనిచేస్తుందని అనుకుని శవాన్ని అందులో ఉంచినట్లు తెలిపారు. దీనిపై బాధితులు తనకు ఫిర్యాదు చేశారని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.