దగ్గరుండి మరీ భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య - కారణం తెలిస్తే షాక్​ అవుతారు! - Wife Did 2nd Marriage To Husband - WIFE DID 2ND MARRIAGE TO HUSBAND

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 12:55 PM IST

Wife Did 2nd Marriage To Husband : ఓ భార్య తన భర్తకు దగ్గరుండి మరో వివాహం జరిపించిన అరుదైన, ఆసక్తికర ఘటన మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన సురేశ్, సరితలకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సురేశ్​ మేనమామకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద బిడ్డకు పెళ్లి చేశారు. చిన్నమ్మాయి సంధ్య మాత్రం మానసిక దివ్యాంగురాలు.

సంధ్యను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు సురేశ్​ వద్ద ప్రస్తావించగా, భార్య సరిత సైతం భర్త రెండో వివాహానికి అంగీకరించింది. సంధ్యకు కూడా సురేశ్​ అంటే ఇష్టమని, అందుకే ఇద్దరికీ ముడి పెట్టామని సమీప బంధువులు చెప్పారు. మానవతా దృక్పథంతోనే సంధ్యను తన భర్త మనువాడినట్లు సరిత చెప్పింది. ఇలాంటి వివాహాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ భర్తకు రెండో వివాహం జరిపించిన అరుదైన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.