యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన - వరుస సెలవులతో పెరిగిన రద్దీ - weekand holidays rush in yadadri - WEEKAND HOLIDAYS RUSH IN YADADRI
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2024, 4:00 PM IST
Weekand Rush in Yadadri : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేశారు. ఆలయంలో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణతో సన్నాయి మేళాలతో సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పండితులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు.
వారాంతంతో పాటుగా వరుస సెలవులు కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి హరిహరుల క్షేత్రాలను దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. ఇవాళ్టి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు కావడంతో భక్తుల రద్దీ కొనసాగనుంది. యాదాద్రి ఆలయం గర్భగుడి గోపురానికి బంగారు తాపడం తుది మెరుగులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించారు.