"కూటమి విజయానికి శుభాకాంక్షలు" పేరుతో ప్రత్యేక వస్త్రం - 20 రోజుల్లో రూపొందించనున్న చేనేత దంపతులు - Weaver Couple Different Wishes - WEAVER COUPLE DIFFERENT WISHES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 7:47 PM IST
Weaver Couple Different Wishes to NDA leaders: భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి విజయాన్ని సాధించి ప్రమాణ స్వీకారం రోజున కృతజ్ఞతలు తెలిపేందుకు ఒక ప్రత్యేక చేనేత వస్త్రాన్ని విజయనగరం కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు రూపకల్పన చేయిస్తున్నారు. ఆయన సూచన మేరకు లావేరు హెడ్ క్వార్టర్‌కు చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు ఈ వస్త్రాన్ని రూపొందిస్తున్నారు. "ఎన్డీఏ కూటమి విజయానికి శుభాకాంక్షలు" అనే టైటిల్‌తో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ముఖ చిత్రాలను ఆ వస్త్రంపై రూపకల్పన చేయనున్నారు. 20 రోజులపాటు విరామం లేకుండా శ్రమిస్తే ఈ వస్త్రాన్ని రూపొందించడం సాధ్యమవుతుందని వారు అప్పలనాయుడుకి వివరించారు. దానిని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న రోజున అందజేస్తామన్నారు.
అలాగే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు శుభాకాంక్షలు తెలిపే విధంగా కూడా మరో చేనేత వస్త్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయ్యేందుకు త్యాగం చేసిన పవన్ కల్యాణ్, యువగళం పాదయాత్ర విజయవంతంగా నిర్వహించినందుకు లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపే విధంగా కూడా ప్రత్యేక వస్త్రాలను చేనేత మగ్గంపై రూపొందిస్తున్నట్లు కూటమి అభ్యర్థి తెలిపారు.