LIVE: ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటి విడుదల - ప్రత్యక్ష ప్రసారం - Water release program to canals
🎬 Watch Now: Feature Video
LIVE : పట్టిసీమ ఎత్తిపోతల పథకం (పోలవరం కుడి కాల్వ) ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించిన క్రమంలో కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ రోజు విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద మొన్నటి వరకు 8 అడుగుల మాత్రమే ఉన్న నీటి మట్టం పట్టిసీమ నీటితో మంగళవారం సాయంత్రానికి 11.01 అడుగులకు పెరిగింది. నీటి నిల్వ 2.08 టీఎంసీలకు చేరింది. మంగళవారం మధ్యాహ్నం 10.8 అడుగుల మట్టం ఉండగా, 2.78 టీఎంసీల మేర నీరు ఉంది. సాయంత్రానికి 2.80 టీఎంసీలకు చేరింది. బుధవారానికి మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటి విడుదల చేశారు. మంగళ వారం ఉదయం ఆరు గంటలకు పట్టిసీమ వద్ద 17 పంపుల ద్వారా 6,018 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇలా అక్కడి నుంచి గోదావరి జలాల ప్రవాహం కొనసాగనున్న క్రమంలో కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదలకు నిర్ణయించారు.
Last Updated : Jul 10, 2024, 10:35 AM IST