పెట్రోల్​లో నీళ్లు - తార్నాక బంక్​లో వాహనదారుల ఆందోళన - WATER IN PETROL TARNAK BUNK - WATER IN PETROL TARNAK BUNK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 12:05 PM IST

Water in Petrol in Hyderabad : హైదరాబాద్  తార్నాకలో  హెచ్​పీ ఏజెన్సీ పెట్రోల్ బంక్​లో పెట్రోల్​తో పాటు వాటర్ కూడా వస్తోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఆరు వాహనాల్లో పెట్రోల్ పోయించిన కొద్ది సేపటికే అవి మొరాయించడంతో వాహనదారులు కంగుతిన్నారు. వెంటనే పరిశీలించగా పెట్రోల్​లో నీరు కలిసిందని గుర్తించారు. దీంతో పెట్రోల్ బంక్ వద్ద వారు ఆందోళనకు దిగారు. ఈ విషయమై  పెట్రోల్ బంక్ మేనేజర్​ను వివరణ కోరగా ఆయన నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో వాహనదారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు.

తన కారులో పెట్రోల్ పోయించుకున్న ఓ వాహనదారు కొద్దిసేపటి తరువాత సమస్య రావడంతో చెక్ చేయగా పైపులో నుంచి నీళ్లు రావడంతో కంగుతిన్నారు. నేరుగా పెట్రోల్ ద్వారా ఇంజిన్​లోకి వాటర్ వెళ్తే వాహనం పాడవుతుందని వాపోయారు. వాహనాన్ని రిపేర్ చేయడానికి  అదనపు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా పెట్రోల్​ను కల్తీ చేయడం కరెక్టు కాదన్నారు. పెట్రోల్ పంప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.