ప్రజాస్వామ్య రక్షణలో ఓటు హక్కు కీలకం - ఈనాడు - ఈటీవీ భారత్ ఓటు సదస్సు
🎬 Watch Now: Feature Video
Voter Registration Awareness Programme: ప్రజాస్వామ్య రక్షణలో ఓటు హక్కు కీలకమని ఎన్నికల డ్యూటీ శ్రీనివాసరావు అన్నారు.పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని భాస్కర్ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల డ్యూటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒకరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓటు నమోదుపై విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
కళాశాల డైరెక్టర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వజ్రాయుధం ఒక్క ఓటు మాత్రమేనని అన్నారు. ఎవరు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సమర్థవంతులైన నాయకులు అవసరమని వివరించారు. సుమారు 30 మంది విద్యార్థులు ఓట నమోదుకు దరఖాస్తులు చేసుకున్నారు. త్వరలో రానున్న ఎన్నికల్లో తొలి సారిగా ఓటు హక్కు వినియోగించుకోబుతున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. రాజ్యాంగం స్ఫూర్తితో మంచి వ్యక్తికి ఓటు వేసి మా కర్తవ్యాన్ని నెరవేరస్తామని పేర్కొన్నారు.