కళ్యాణానికి సిద్ధమవుతున్న ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం - Vontimitta Kodandarama Kalyanam - VONTIMITTA KODANDARAMA KALYANAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 6:53 PM IST

Vontimitta Kodandarama Kalyanam JEO Conducted Review Meeting : ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలు, ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు. టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్సార్​ జిల్లా కలెక్టర్ శ్రీ‌ విజయరామరాజు (Vijayarama raju), జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశిల్ జిల్లా యంత్రాంగంతో సోమ‌వారం ఒంటిమిట్టలో జేఈవో సమీక్ష (JEO Meeting) నిర్వహించారు.

Sri Ramu Navami 2024 in Andhra Pradesh : ఏప్రిల్ (April) 16వ తేదీ అంకురార్ప‌ణ‌, 17న‌ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అదే నెల 20వ తేదీ హనుమంత వాహనం, 21వ తేదీ గరుడవాహనం, 22వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 23న రథోత్సవము,25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగము జరుగుతాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.