LIVE : డ్రగ్స్ కేసుపై విశాఖ సీపీ రవిశంకర్ మీడియా సమావేశం - CP PC On VIZAG PORT DRUGS BUST - CP PC ON VIZAG PORT DRUGS BUST
🎬 Watch Now: Feature Video
Published : Mar 22, 2024, 11:46 AM IST
|Updated : Mar 22, 2024, 11:55 AM IST
Vizag CP Ravi Shankar Press Meet Live : విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టివేతపై విశాఖ సీపీ రవిశంకర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కంటైనర్‌లో బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన 25 వేల కిలోల డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖలోని డ్రగ్స్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ కంటైనర్‌ను విశాఖ కంటైనర్ పోర్టులో ఉంచారు. కస్టమ్స్, సీబీఐ అధికారుల భద్రతలో డ్రగ్స్ కంటైనర్ ఉండగా, విశాఖలోనే సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం మకాం వేసింది. కంటైనర్‌కు సంబంధించిన రికార్డులు, పత్రాలు తనిఖీ చేస్తున్నారు. ఈనెల 16వ తేదీన చైనా నౌక ద్వారా కంటైనర్ విశాఖ వచ్చినట్లు గుర్తించారు.బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి కంటైనర్ ‘డ్రైడ్ ఈస్ట్’ బ్యాగ్‌లతో విశాఖకు బయలుదేరినట్లు సీబీఐ అధికారుల గుర్తించారు. ఈ కంటైనర్ సంధ్యా ఆక్వా పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్‌ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్‌పోల్ అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగింది. తాజాగా ఈ కేసు వివరాలకు సంబంధించి విశాఖ సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
Last Updated : Mar 22, 2024, 11:55 AM IST