ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి Vs నిఖిల్నాథ్ రెడ్డి - ఈద్గా మైదానం వద్ద ఉద్రిక్తత - YCP LEADER VISWESWARA REDDY - YCP LEADER VISWESWARA REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 2:52 PM IST
Visweswara Reddy Car Hit Nikhilnath Reddy Car in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఈద్గా మైదానం(Eidgah Maidan) వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, ఆయన తమ్ముడు కుమారుడు నిఖిల్నాథ్ రెడ్డి వేర్వేరు వావానాల్లో అక్కడికి చేరుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలు అనంతరం విశ్వేశ్వరరెడ్డి కారులో వెళ్తుండగా అనుకోకుండా నిఖిల్నాథ్ రెడ్డి కారును ఢీ కొట్టింది.
నిఖిల్నాథ్ రెడ్డి కారును ఢీకొన్న తరుణంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కారులో వెళ్తున్న విశ్వేశ్వర రెడ్డి కారును నిఖిల్నాథ్ రెడ్డి, ఆయన అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరారు. ఇరువర్గాల వారిని నిలువరించి సర్ది చెప్పారు. ఇరువర్గాల వారు అక్కడి నుంచి వెళ్లిన అనంతరం పోలీసులు వెనుతిరిగారు.