వింగ్స్ ఇండియా ప్రదర్శనకు నేడు, రేపు సందర్శకులకు అనుమతి - పెరిగిన తాకిడి - Visitors at Wings India 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 1:00 PM IST

Visitors at Wings India Aviation Event in Begumpet : హైదరాబాద్​ బేగంపేట ఎయిర్​ పోర్టులో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనలో సందర్శకుల సందడి మొదలైంది. ప్రదర్శనలో 3వ రోజు సందర్శకులను అనుమతిచండంతో దీన్ని చూడటానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి రెండు రోజులు పూర్తిగా వాణిజ్యపరంగా ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు, రేపు సందర్శకులను అనుమతిస్తారు. ఇందుకోసం బుక్​ మై షో యాప్​ ద్వారా టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి రూ.750గా నిర్ణయించారు. 3 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. 

అయితే సందర్శకులు విమానాల్లోకి నేరుగా వెళ్లడానికి వీలు లేదు. ప్రదర్శనలో ప్రతి విమానం పక్కన బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు విమానాల ప్రత్యేకతలు పూర్తిగా వివరిస్తున్నారు. రెండు రోజులే సందర్శకులను అనుమతించనుండడంతో ప్రదర్శనను చూడడానికి ప్రజలు తరలివస్తున్నారు. వచ్చేవారికి ప్రదర్శన మాత్రమే కాకుండా వినోదం కోసం మధ్యాహ్నం 3 గంటలకు శివమణి బృందంతో డ్రమ్స్ సంగీతోత్సవం ఏర్పాటు చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.