'విశాఖ ఉక్కు మూసివేతకు కుట్ర'- 22న సీఎండీ కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాల పిలుపు - Visakha Steel Plant Employees - VISAKHA STEEL PLANT EMPLOYEES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 3:48 PM IST
Visakha Steel Plant Employees Fire On Central Government : ఈనెల 22న స్టీల్ ప్లాంట్ సీఎండీ కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి కుమార స్వామి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా విశాఖ ఉక్కును మూసివేసే దిశగా చర్యలు అగలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గంగవరం పోర్ట్లో లక్ష టన్నుల ముడి సరుకు ఉన్నా, కేంద్రం దానిని గోడ దాటించే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు.
దశల వారీగా ప్లాంట్ను నిర్వీర్యం చేసి మూసివేయాలని కుట్ర జరుగుతుందని, దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లలో ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తుంటే, విశాఖ ఉక్కు పరిశ్రమలో మాత్రం ఉత్పత్తిని తగ్గించి నష్టాలను మూటకట్టుకునేలా యాజమాన్యం ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు. ఆర్థిక నష్టాలను కారణంగా చూపించి ప్లాంటును మూసివేయాలన్న ఆలోచనలో భాగంగానే ఈ కుట్రలు జరుగుతున్నాయంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ముఖ్య నాయకులతో మా ఈ టీవీ ప్రతినిధి ముఖాముఖి.