విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం - ఫ్లైఓవర్​పై డివైడర్​ను ఢీకొని ఇద్దరు మృతి - Visakha NAD Flyover Road Accident - VISAKHA NAD FLYOVER ROAD ACCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 11:41 AM IST

Visakha NAD Flyover Road Accident: విశాఖ ఎన్​ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తనవరపు కుమార్, అరవెల్లి పవన్ కుమార్​గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్​పోర్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

విశాఖపట్నంలోని ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే ట్రాఫిక్​ను మళ్లించడానికి గతంలో ఈ ఫ్లై ఓవర్​ను నిర్మించారు. ఇంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలతో పాటు ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.