భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన - ఆసిఫాబాద్ జిల్లాలో 54 గ్రామాలకు నిలిచిన రాకపోకలు - Peddagu flowing fast Kagaj Nagar - PEDDAGU FLOWING FAST KAGAJ NAGAR
🎬 Watch Now: Feature Video
Published : Jun 23, 2024, 11:35 AM IST
Villages Transport Closed Due to Pedda Vagu Flowing Fast in Kagaznagar : రాష్ట్రంలో ఆయాచోట్ల కురుస్తున్న వర్షాలకు పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాగులకు ఆవలివైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలంలో అందవెల్లి సమీపంలో ఉన్న పెద్ద వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. దీంతో వాగుపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు పెద్దవాగులో వరద నీరు ఎక్కవైంది. దీంతో ఉద్ధృతి క్రమంగా పెరిగింది.
Pedda Vagu Flowing Fast in Kagaznagar : జిల్లాలోని కాగజ్‌నగర్, దహెగాం, భీమిని మండలాల్లోని 54 గ్రామాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనే కొత్తగా నిర్మించిన వంతెనకు మరమ్మతులు జరుగుతుండటంతో రాకపోకలకు అంతరాయం లేకుండా అధికారులు తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. వాగులో నీరు అధికంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.