ఓట్ల కౌంటింగ్​కు ఎన్టీఆర్ జిల్లాలో భారీ బందోబస్తు- కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత - VIJAYAWADA CP interview - VIJAYAWADA CP INTERVIEW

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 12:17 PM IST

Vijayawada CP On Vote Counting Day Security : ఓట్ల లెక్కింపునకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచెల భద్రత ఉంచారు. 160మంది మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశామని సీపీ తెలిపారు. కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలు, మీటింగ్ లకు అనుమతిలేదని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. కౌంటింగ్​ సెంటర్లో 760 స్టాఫ్​, జిల్లా వ్యాప్తంగా మూడువేలకు పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. 

ఎన్నికల రోజును దృష్టిలో పెట్టుకుని గొడవలు, అల్లర్లకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్​ నెల మొత్తం సెక్షన్​ 144 అమలు లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిచిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలపై దృష్టి పెట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెబుతున్న ఎన్టీఆర్ జిల్లా సీపీ రామకృష్ణతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.