5 వందలకు 7 లక్షలు- రండి బాబు రండి! స్కీమ్ వెనుక స్కామ్ గుర్తించక లబోదిబో - Protest on Money Scheme Fraud - PROTEST ON MONEY SCHEME FRAUD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 6:45 PM IST
Victims Protest on Money Scheme Fraud: నెల్లూరులో మనీ స్కీం తరహాలో భారీ మోసం బయటపడింది. అధిక డబ్బు ఆశ చూపి ప్రజల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకుని మోసానికి పాల్పడ్డారు. స్థానిక పొదలకూరు రోడ్డులోని విశ్వనాథ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏజెంట్లను నియమించి అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూళ్లకు తెరలేపింది. రూ.500 కడితే రూ.7 లక్షలు, రూ.6 వేలు కడితే 18 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మబలికి భారీగా నగదు వసూలు చేసింది.
తక్కువ మొత్తంలో నగదు చెల్లిస్తే రెట్టింపు డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో జిల్లాలో 10 వేల మందికి పైగా ట్రస్టుకు నగదు చెల్లించారు. నగదు ఎప్పుడిస్తారని డబ్బు చెల్లించిన వారు నిర్వాహకులను నిలదీయడంతో విషయం వెలుగుచూసింది. నిర్వాహకులు సమాధానం దాటవేస్తుండటంతో బాధితులంతా ట్రస్టు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు. చెన్నై కేంద్రంగా ట్రస్టు నిర్వహిస్తున్నట్లు బాధితులు తెలిపారు. అధికారులు దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.