ఆ మూడు సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం : వెంకయ్య నాయుడు - VENKAIAH NAIDU ON HEALTHY LIFE

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 3:19 PM IST

thumbnail
కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులే బస్తీ ప్రజల వద్దకు రావడం ఆనందదాయకం : వెంకయ్య నాయుడు (ETV Bharat)

Venkaiah Naidu Started To Free Medical Camp In Hyderabad : హైదరాబాద్​లోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్, ఏఐజీ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. పేదవారు పెద్దపెద్ద ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం కన్నా కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులే బస్తీ ప్రజల వద్దకు వచ్చి వైద్య పరీక్షలు చేయడం మంచి పరిణామమని తెలిపారు.

పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం ఈ మూడు సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వీటిపై వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బోరబండ బస్తీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో భాగస్వాములైన ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యానికి, ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ నవీన్‌రెడ్డి, శిబిరంలో సేవలు అందించిన వైద్యులకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.