వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాలతో స్వయం సమృద్ధి సాధించాలి : వెంకయ్యనాయుడు
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 12:35 PM IST
Venakaiah Naidu on Agriculture Technology : వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాలతో స్వయం సమృద్ధి సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యవసాయం ఒక పవిత్రమైన వృత్తని, ఈ వృత్తిలో ఉండేవారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాక, దేశ నిర్మాణానికి కూడా చేయూతను ఇవ్వగలరని చెప్పారు. వ్యవసాయ రంగంలో పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలంటే అత్యంత నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టడంతో పాటు సమగ్ర విధానాలను అవలంభించాలని సూచించారు.
ఉత్పాదకత పెంచుకోవడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, యంత్రాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కచ్చితత్వమైన సాగు, అధునాతన సాగు, నీటిపారుదల పరిజ్ఞానాలు, సాగు పద్ధతుల్లో స్మార్ట్ విధానాలు అనుసంధానించడం వంటివి అనుసరించాలని తెలిపారు. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ స్వర్ణోత్సవ వేడుకలు పురస్కరించుకుని హైదరాబాద్ శివారు కొంపల్లిలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ అధినేత మండవ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.