రెడ్డి సామాజికవర్గానికే నామినేటెడ్ పదవులా? - వైసీపీకి బుద్ధి చెప్పేందుకు వాల్మీకులు సిద్ధం - YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 2:01 PM IST
Valmiki Seva Samithi Fires on YSRCP: నామినేటెడ్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని వాల్మీకి సేవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాల్మీకులకు చెందిన దేవాలయానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎలా ఛైర్మన్గా నియమిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా బీసీ, నా ఎస్సీ అని చెప్పడం వరకే గాని పదవులు మాత్రం రెడ్లకే ఇస్తున్నారని విమర్శించారు.
కాగా కర్నూలులోని వెంకయ్యపల్లె ఎల్లమ్మ దేవాలయం ఛైర్మన్గా బేతం కృష్ణుడుకు రెండోసారి అవకాశం కల్పించకపోవడంతో ఆయన కోడుమూరు వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్గా వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనకు ఎందుకు రెండోసారి అవకాశం కల్పంచలేదని ధ్వజమెత్తారు. రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వారందరిని రెండోసారి ఛైర్మైన్గా కొనసాగించినప్పుడు దేవాలయాన్ని అభివృద్ధి చేసిన తనను ఎందుకు తప్పించారని నిలదీశారు. జిల్లాలో వాల్మీకులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వాల్మీకులు అధికార పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.