జగన్ అధికార దాహానికి నాడు దళిత బిడ్డ - నేడు బీసీ బిడ్డ బలి : వడ్డెర సంఘం నాయకులు - Vaddera Leaders fire on ycp govt - VADDERA LEADERS FIRE ON YCP GOVT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 10:11 PM IST
Vaddera Community Leaders Angry with Jagan Government : అధికార దాహానికి నాడు దళిత బిడ్డ, నేడు బీసీ బిడ్డలను బలి చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వడ్డెర సంఘం నేతలు ధ్వజమెత్తారు. కోడి కత్తి డ్రామా-2కు జగన్ ప్లాన్ వేశారని ఆరోపించారు. బీసీ, వడ్డెర బిడ్డలపై వెల్లంపల్లి శ్రీనివాస్ హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నేతలు మాట్లాడుతూ, తప్పు చేయని వారిని గులకరాయి కేసులో అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వేముల సతీష్‌ను పరుగులు పెట్టిస్తూ కోర్టుకు తరలించడం దారుణమన్నారు. ఇప్పటికి దుర్గారావు జాడ తెలియడంలేదని మండిపడ్డారు. అతని భార్య బిడ్డలు, తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని తెలిపారు. కోర్టు వద్ద దుర్గారావు భార్య చంటి బిడ్డలతో రోదిస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారిని అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని వారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎలా రాయి వేస్తారని ప్రశ్నించారు. ఈసారి వేసిన కుట్రలో వడ్డెరలే కనిపించారా? అని మండిపడ్డారు. రాయి ఘటనరోజు అసలు దుర్గారావు బయటకి రాలేదని వారు కుటుంబసభ్యులు చెబుతున్నారని వెల్లడించారు. మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ దుర్గారావు కుటుంబం తిరుగుతోందని తెలిపారు. పిల్లలు నాన్న ఎక్కడని కన్నీరు పెడుతున్నారని వివరించారు. ఇప్పటికైన వారిని వెంటనే విడుదల చేయాలని తెలిపారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ వడ్డెర సంఘం నేతలు హెచ్చరించారు.