యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగుతేజం - తొలి ప్రయత్నంలోనే మూడోర్యాంకుతో ఐఏఎస్ సాధించిన అనన్య - UPSC Third Ranker Ananya Interview - UPSC THIRD RANKER ANANYA INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Apr 16, 2024, 6:17 PM IST
UPSC Third Ranker Ananya Interview : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి, ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య తొలి ప్రయత్నంలోనే సత్తా చాటారు. అందుకోసం రెండేళ్లు కష్టపడి పట్టువిడవక చదివారు. అంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివానని ఆమె చెబుతున్నారు.
UPSC Civils 2024 Results : చదివే సమయంలో ఒత్తిడికి గురికాకుండా క్రికెట్ చూడటం, నవలు చదవడం చేస్తున్నట్లు తెలిపారు. నిజం చెప్పాలంటే ప్రతికూల సమయాల్లో సైతం రాణించాలంటే ఎలా మెలగాలో విరాట్ కోహ్లీనే తనకు ప్రేరణ అని చెబుతున్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుంచే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య చెప్పారు. రెండేళ్లు కష్టపడి మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.