భూమా అఖిలప్రియ అనుచరుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - YSRCP ATTACKS ON TDP FOLLOWERS - YSRCP ATTACKS ON TDP FOLLOWERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 10:11 AM IST

Updated : May 15, 2024, 5:43 PM IST

Unknown Persons Attacked on Bhuma Akhila Priya Follower in Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అఖిలప్రియ నివాసం బయట ఉన్న అనుచరుడిపై మంగళవారం అర్థరాత్రి కారులో వచ్చిన దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్రగాయలతో దుండగుల నుంచి తప్పించుకున్న నిఖిల్‌  అఖిలప్రియ ఇంట్లోకి పారిపోయాడు. గాయపడిన నిఖిల్​ను చూసి అక్కడే ఉన్న మిగిలిన అనుచరులు అప్రమత్తం కావడంతో అగంతకులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

నిఖిల్ గతంలో నంద్యాలలో జరిగిన నారా లోకేశ్​ (Nara Lokesh) పాదయాత్ర సమయంలో మరో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ, ఏవి ఏవి సుబ్బారెడ్డి నివాసం వద్ద పోలీసులు (Police ) గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Last Updated : May 15, 2024, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.