LIVE : హైదరాబాద్లో అమిత్ షా మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Amit Shah Press Meet Live - AMIT SHAH PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 11, 2024, 3:32 PM IST
|Updated : May 11, 2024, 3:54 PM IST
Union Ministers Amit Shah And Kishan Reddy Press Meet Live : ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభివృద్ధిని ఆసరాగా చేసుకుని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపారు. అధికారం కోసం కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో కాంగ్రెస్ 70 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదని భద్రతా బలగాలను కాంగ్రెస్ నేతలు అవమానపరిచారని ధ్వజమెత్తారు.
Last Updated : May 11, 2024, 3:54 PM IST