ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను : పెమ్మసాని - Pemmasani on Politics - PEMMASANI ON POLITICS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 3:01 PM IST
Pemmasani on Politics : సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలకు చేసేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అందుకే తాను కూడా ప్రజలకు సేవ చేసేందుకు, వారి సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. సమాజంలో పాలసీ మేకింగ్ చేయాలంటే చట్ట సభల్లో కూడా సమర్థవంతమైన నాయకులు కావాలని చెప్పారు. గుంటూరులో కమ్మజన సేవా సమితి నేతృత్వంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Pemmasani Participate Artificial Organ Distribution Program : ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ బాధితులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ధైర్యం కోల్పోకుండా వారు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే దివ్యాంగుల తెగువను ఆయన మెచ్చుకున్నారు. అదేవిధంగా నిరుపేదలకు కుట్టుమిషన్లు, తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఎంతోమంది అనేక ఏళ్లు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.