Police Catch Women Thieve in Ongole : మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలు, నాటికల్లో నేరాలు చేసే పాత్రలు చూసి ప్రభావితమైన నిందితురాలు అదే తరహాలో చోరీలకు పాల్పడేది. ఆమెపై గతంలోనే పలు స్టేషనల్లో కేసులు ఉన్నాయని గుర్తించిన పోలీసులు వాటిని దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు.
వారు ఇచ్చిన మత్తు మందులను నేరాలకు ఉపయోగించడం ప్రారంభించింది. వృద్ధులు ఉన్న ఇళ్లకు వెళ్లి వారిని మచ్చిక చేసుకుని మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడేది. వివాహ, శుభకార్యాల్లోనూ ఇదే తరహాలో మహిళల నుంచి నగలు అపహరించుకుపోయేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
మీ ఇంటికి ఇలాంటి 'తెనాలి' గ్యాంగ్ రావొచ్చు - బీకేర్‌ఫుల్!
నిందితురాలు సుజాత ఈ తరహా దొంగతనాలకు పాల్పడే క్రమంలో మత్తు తీవ్రత ఎక్కువై ఇద్దరు మృతికి కూడా కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. సదరు మహిళపై వివిధ స్టేషన్లలో నమోదైన కేసులపై సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు పక్కా పథకం ప్రకారం ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 35లక్షలు విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు.