శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ నటులు - సుప్రభాత సేవలో పాల్గొన్న కేంద్రమంత్రి కుమారస్వామి - Movie Actors in Tirumala Temple - MOVIE ACTORS IN TIRUMALA TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 5:31 PM IST

Movie Actors Visited in Tirumala Srivari Temple: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్ తేజ్, మంచు లక్ష్మి, నటి ప్రగ్యా జైస్వాల్, నటుడు సుమన్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సినీ నటులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్‌ వలే అమరావతి నగరం అభివృద్ధి చెందాలని నటుడు సుమన్‌ ఆకాంక్షించారు.

Union Minister Kumara Swamy Visit in Tirumala: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కుమార స్వామి దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రి పదవి వరించటం నా అదృష్టమని, దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీతోనే సాధ్యమని కుమార స్వామి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.