మన రాష్ట్ర సంస్కృతి సంప్రాదాయలకు ప్రతీక బోనాల పండుగ : కిషన్‌రెడ్డి - union minister kishan reddy - UNION MINISTER KISHAN REDDY
🎬 Watch Now: Feature Video
Published : Jul 28, 2024, 5:21 PM IST
Union Minister Kishanreddy in bonalu festival 2024 : గడిచిన వంద సంవత్సరాలుగా బోనాల పండుగ రాష్ట్రానికి, భాగ్యనగరానికి ప్రతీకగా నిలుస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణలోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర రాజధానికి తలమానికంగా ఈ బోనాల ఉత్సవాలు నిలుస్తాయని కొనియాడారు. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజలందరూ సమైక్య భక్తిభావంతో బోనాలు అమ్మవారికి సమర్పిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కిషన్‌రెడ్డి, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివస్తున్నారు. నెత్తిన బోనమెత్తి సల్లంగా సూడమ్మ అంటూ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ బీజేపీ ఎంపీ లక్ష్మణ్, స్థానిక నేత మాధవీలత తదితరులు పాల్గొన్నారు.