LIVE : దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - UNION MINISTER KISHAN REDDY LIVE - UNION MINISTER KISHAN REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 4:10 PM IST
కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం లభించనుంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి వారికి సమాచారం వచ్చింది. దీంతో వారిద్దరూ దిల్లీకి బయల్దేరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.'వచ్చే ఐదేళ్లు ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తుంది. సంకల్ప పత్రం పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం..తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేస్తాం. గత పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. వచ్చే ఐదేళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం. దక్షణ భారత దేశంలో భాజపాను మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలను కోరుతున్నా.' అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.