చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్ - Bandi Sanjay tribute To MLA Wife - BANDI SANJAY TRIBUTE TO MLA WIFE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 2:41 PM IST

Minister Bandi Sanjay tribute To MLA Medipalli Wife : భార్యను కోల్పోయిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కలిసిన బండి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భార్య మరణంతో కుంగిపోయిన మేడిపల్లికి ధైర్యం చెప్పారు. ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మరణించడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఇటీవల అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఆయన పిల్లలను ఓదార్చి అసలేం జరిగిందనే విషయంతో పాటు మృతికి గల కారణాలను అడిగి తెలిసుకున్నారు. సత్యం భార్య చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి సీఎం ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.