అధికారుల సమాచార లోపంతోనే ఆలస్యం-మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటున్న నిరుద్యోగులు - Unemployed Protest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 5:42 PM IST
Unemployed Protest Lack of Examination Information : సమాచార లోపం కారణంగా సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోయామని నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఎన్నికల విధులకు తాత్కాలిక పద్ధతిలో డేటా ఆపరేటర్ పోస్టులకు రాత పరీక్షను అధికారులకు నిర్వహించారు. మొత్తం ఏడు పోస్టులకుగాను 560 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేస్తుకున్నారు. వారికి ఎటువంటి హాల్టికెట్లు ఏమీ ఇవ్వకుండా ఈ రోజు ( ఆదివారం) పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
Parvathipuram Manyam District : పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి హాల్ టికెట్లు ఇవ్వకుండా అధికారులు ఫోన్లోనే సమాచారం ఇచ్చారు. అందులో కొంతమందికి ఉదయం 9 గంటలకు పరీక్ష అని, మరికొంత మంది 10 గంటలకు అని అధికారులు అభ్యర్థులు సమాచారం ఇచ్చారు. అందుకు తగ్గట్లుగా అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి వెళ్లిన అభ్యర్ధులకు పరీక్ష నిర్వహించారు. 9 గంటలు దాటిన వారికి పరీక్ష నిర్వహించలేదని అభ్యర్థులు వాపోతున్నారు. సరైన సమాచార ఇవ్వకపోవడం వల్లే పరీక్షకు ఆలస్యంగా హాజరయ్యామని తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు డీఆర్ఓ స్పందిస్తూ ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మళ్లీ పరీక్ష నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.