విశాఖలో ఉబర్ డ్రైవర్ల సమ్మె- ఇష్టారాజ్యంగా కమీషన్ తీసుకుంటున్న యాజమాన్యం - Uber Drivers Protest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 7:21 PM IST
Uber Drivers Protest in Visakha District : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉబర్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో శనివారం సీపీఎం కార్యాలయంలో ఉబర్ డ్రైవర్ల బంద్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉబర్ డ్రైవర్లు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Solve Uber Drivers Problems : లక్షలు వెచ్చించి కారును కొనుగోలు చేస్తే ఉబర్ యాజమాన్యం ఏ రోజుకు ఎంత రేటు చెల్లింస్తుందో అర్థం కావడం లేదని డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు బి.జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉబర్ యాజమాన్యం కమీషన్ కూడా ఇష్టారాజ్యంగా తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.