కవలల కనువిందు - రెండు పాఠశాలల్లో 32 జంటలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 3:45 PM IST

Updated : Feb 23, 2024, 6:55 AM IST

Twins Day Celebrations : తరగతి గదిలో ఇద్దరు కవల పిల్లలు ఉంటే పేర్లు ఆధారంగా వారిని గుర్తించడం ఉపాధ్యాయులకు కాస్తంత కష్టమైన పనే. అలాంటిది ఒకే తరగతిలో మూడు జంటల కవల విద్యార్థులు. మొత్తం పాఠశాలలో పది జంటల కవలలు విద్యార్థిని విద్యార్థులు ఉంటే వారు ఎవరెవరు అనేది గుర్తించడానికి యాజమాన్యం కొంత సమయాన్ని కేటాయించాల్సిందే. ఆ పరిస్థితిని గత ఐదేళ్లుగా ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఎదుర్కొంటోంది. కవలల దినోత్సవం రోజున వారికి ప్రత్యేకంగా వేడుక చేస్తుంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్లో కవలలు దినోత్సవం నిర్వహించారు. 

ఫిబ్రవరి22 కవలల దినోత్సవం పురస్కరించుకొని తమ విద్యాసంస్థలో విద్యను అభ్యసిస్తున్న 20మంది కవలలకు పాఠశాల విద్యాసంస్థ అధినేత పీ.వీ.ఎస్. శాస్త్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పి.సుజాత మాట్లాడుతూ ఇంతమంది కవలలు మా పాఠశాలలో చదవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను జరుపుతున్నామని తెలియజేశారు. కవల విద్యార్థులకు విద్యాసంస్థ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప.గో.జిల్లాలో కవల పిల్లలు అంటే చాలా అరుదుగా కనిపిస్తారు. ఏదైనా పాఠశాలలో ఒకటి లేదా రెండు జంటల కవల పిల్లలు ఉండడం సర్వసాధారణం. కానీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ  పాఠశాలలో 22 జంటల కవల పిల్లలు ఉన్నారు. వారితోపాటు ఇద్దరు ట్రిప్లెట్స్ కూడా ఉన్నారు. ఇంతమంది కవల పిల్లలకు తణుకులోని మాంటిస్సోరి పాఠశాల వేదిక అయింది.

ప్రపంచ కవల పిల్లల దినోత్సవం సందర్భంగా తనకు మాంటిసోరి పాఠశాలలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ పాఠశాలలో ఉన్న కవల పిల్లలందరినీ ఒకచోట చేర్చి సంబరాలు జరిపారు. 22 కవల జంటలు ఉండగా వారిలో రెండు ట్రిపుల్ ఎక్స్ కూడా ఉండడం విశేషం. కవల జంటలకు పళ్లు, పూలు, చాక్లెట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

పాఠశాల డైరెక్టర్ జ్ఞానమంజరి మాట్లాడుతూ ఇంతమంది కవల పిల్లలు మా పాఠశాలలో ఉండడం, వారందరికీ వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కవల పిల్లలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కవల పిల్లలు అందరికీ భగవంతుడు మంచి చదువు, ఆరోగ్యం ప్రసాదించాలని జ్ఞాన మంజరి ఆకాంక్షించారు.

Last Updated : Feb 23, 2024, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.