'హోమం ద్వారా భక్తులలో విశ్వాసం': TTD ఆగమ సలహదారుడు మోహనరంగాచార్యులు - TTD Agama Sastra Advisor interview
🎬 Watch Now: Feature Video
TTD Agama Sastra Advisor interview: తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి, కల్తీ నెయ్యితో లడ్డూ తయారైన నేపథ్యంలో ప్రాయశ్చిత్త కార్యక్రమానికి తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం టీటీడీ నిర్వహిస్తోంది. ఆలయంలోని యాగశాలలో నిర్వహించనున్న హోమం ద్వారా భక్తులలో విశ్వాసం నింపడానికి వీలు కలుగుతుందని టీటీడీ ఆగమ సలహదారులు తెలిపారు. సంవత్సరం మొత్తంలో జరిగే లోపాలు పవిత్రోత్సవాలలో సరైపోతాయని తెలిపారు. అయితే ప్రస్తుతం వస్తున్న నెయ్యిలో దోషం ఉందని, లడ్డూ అపవిత్రం జరిగిందనే వార్తల వలన, ఏమైనా ఆ పాత్ర ఇంకా ఏమైనా ఉందేమోనని మహాశాంతి యాగం చేస్తున్నామన్నారు. అదే విధంగా హోమం తర్వాత అని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామని ఆగమ సలహదారులు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులే ఈ హోమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దీనిని ఆగమ సలహదారులు దగ్గరుండి పర్యవేక్షిస్తారన్నారు. యాగశాలలో నిర్వహించనున్న మూడు హోమగుండాలు, పంచగవ్య ప్రోక్షణ కార్యక్రమాల తీరుపై టీటీడీ ఆగమ సలహదారుడు మోహనరంగాచార్యులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.