ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా : మంత్రి పొన్నం - ponnam on RTC employees PRC
🎬 Watch Now: Feature Video
Published : Mar 7, 2024, 5:05 PM IST
TSRTC Grand Festival Challenge : ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ప్రజలపై భారం పడకుండా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే విధంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే అత్యుత్తమ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు మహాలక్ష్మి పథకం పేరిట ప్రతి ఏడాది అవార్డులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మంత్రి సూచించారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో సకాలంలో చేసుకుందామని వివరించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీలో త్వరలోనే నియామకాలు జరగబోతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.