దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం - రెండు బస్సులు దగ్దం - Dilsukhnagar Bus fire Accident
🎬 Watch Now: Feature Video
Published : Jan 22, 2024, 10:57 AM IST
TSRTC Bus Fire Accident Dilsukhnagar Depot : ఈ మధ్య కాలంలో బస్సులలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవించడం చూస్తున్నాం. ఈ ఘటనల్లో భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. తాజాగా దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident At Dilsukhnagar Depot : దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. బస్సు నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో గమనించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు బస్సుల్లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని డిపో అధికారులు తెలిపారు. ఇంజిన్ విద్యుదాఘాతానికి గురై మంటలు వ్యాపించి ఉండొచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.