గిరిజన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి - ఆరు గంటలు ధర్నా - గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 12:33 PM IST
Tribals Protest in Parvathipuram : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆరు గంటల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, నాన్ షెడ్యూల్ ఏరియా గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో కలపాలని, జీవో నెంబర్ 117 ను టీడబ్ల్యూ పాఠశాలకు వర్తింప చేయాలని, హెచ్ఎంఎస్ఏ క్యాడర్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, ప్రతీ జీపీఎస్ పాఠశాలకు ఇద్దరు ఎస్జీటీలను నియమించాలని, సవర భాష వాలంటీర్లను కొనసాగించాలని, జాతపు, గజబ భాషా వాలంటీర్లను నియమించాలని నాయకులు డిమాండ్ చేశారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఆర్టీలందరినీ రెగ్యులర్ చేయాలని, వీరిని బీఎస్సీ నుంచి మినహాయించాలని, పండిట్ పీఈటీ పోస్టులను 100% అప్డేట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గిరిజన విద్యా రంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. సమస్యల పరిష్కారం చేపట్టని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.